Gujarat Titans

Gujarat Titans: గుజరాత్​ ఓటమికి కారణం ఈ ఆటగాళ్లేనా..

Gujarat Titans: ఐపీఎల్​లో కీలక పోరులో గుజరాత్​ చతికిలబడింది. లీగ్ మ్యాచ్​లో అదరగొట్టిన ఆ టీమ్ ఫ్లేఆఫ్స్​లో మాత్రం నిరాశపరిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. నిజానికి ఈ సారి గుజరాత్​ హాట్​ ఫెవరెట్​గా కనిపించింది. రోహిత్ ఇచ్చిన క్యాచ్​లను సైతం ఒడిసి పట్టుకోలేకపోయింది. అయితే కొంతమంది ఆటగాళ్ల వల్లే గుజరాత్​ మ్యాచ్​ ఓడిపోయిందని సోషల్​ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ఆటగాళ్లెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జెరాల్డ్ కోయెట్జీ
గుజరాత్ ఎలిమినేటర్ ఓటమికి ఫాస్ట్ బౌలర్ కోయెట్జీ ప్రధాన కారణమని నెటిజన్లు అంటున్నారు. అతడు కేవలం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఈ విధంగా, గుజరాత్ ఓటమికి కోయెట్జీ బాధ్యత వహించాడు.

ప్రసిద్ కృష్ణ
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ అతను తన నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. అయితే అతడి బౌలింగ్​లో ఫీల్డర్లు క్యాచ్​లు వదిలేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

రషీద్ ఖాన్ :
గుజరాత్ టైటాన్స్ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. కష్ట సమయాల్లో రషీద్ జట్టుకు అండగా నిలిచేవాడు.. కానీ ఈ సీజన్‌లో రషీద్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

Also Read: Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న ఐపీఎల్​ రికార్డులు ఇవే..

కుశాల్ మెండిస్ తప్పు
ఈ మ్యాచ్‌లో గుజరాత్​కు కుశాల్ మెండిస్ విలన్‌గా మారాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వికెట్ కీపింగ్ చేసిన మెండిస్ రెండు క్యాచ్‌లు వదిలేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ క్యాచ్ గుజరాత్ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

గిల్ విఫలం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గిల్ మొదటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. అతను జట్టు తరపున ఒక పరుగు మాత్రమే చేశాడు. కీలకమైన మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ వైఫల్యం వల్ల గుజరాత్​కు గట్టి దెబ్బ పడింది. గిల్ – సాయి సుదర్శన్ మంచి ఆరంభం ఇస్తే.. మ్యాచ్ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *