pink ball test

Pink Ball Test: పింక్ బాల్ టెస్టుకు ముందు గందరగోళంలో ఆసీస్..జట్టులో విభేదాలంటూ వార్తలు

Pink Ball Test: ఆసీస్ జట్టులో విభేదాలున్నాయా..? పెర్త్ టెస్టు ఓటమితో అవి ముదిరి పాకాన పడ్డాయా..? అవునంటూ వార్తలు..కీలకమైన బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడుతున్న సమయంలో ఇలాంటి కథనాలు రావడంతో ఆసీస్ జట్టులో ఏదో జరుగుతోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే హాజిల్ వుడ్ గాయం పేరుతో దూరంగా ఉండగా…కీలకమైన టెస్టుకు ముందు మిచెల్ మార్ష్ గాయం ఆసీస్ జట్టును మరింత ఇబ్బందిలో పడేసింది.

గాయం పేరుతో ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌ను గులాబి బంతితో ఆడే రెండో టెస్టు నుంచి తప్పించడం వెనక ఏదో మిస్టరీ ఉందని భారత మాజీ బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అంటున్నాడు.  తొలి టెస్టు మూడో రోజు ఆట అనంతరం హేజిల్‌వుడ్‌ చేసిన వ్యాఖ్యలతో ఆసీస్‌ జట్టులో విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు వచ్చాయి. నాలుగో రోజు ఆస్ట్రేలియా ఎలా ఆడబోతోందన్న ప్రశ్నకు హేజిల్‌వుడ్‌ బదులిస్తూ..  ఒక బ్యాటర్‌ను ఈ ప్రశ్న అడగాలంటూ మమ్మల్ని కాదని ఆసీస్ బ్యాటర్లను విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలనే బలపరుస్తూ గవాస్కర్ ఆస్ట్రేలియా భయపడుతోందన్నాడు.

ఆస్ట్రేలియా జట్టులో కలవరం స్పష్టంగా కనిపిస్తోందంటూ  కొందరిపై వేటు వేయాలని మాజీ ఆటగాళ్లు చెబుతున్నట్లుగా తెలుస్తోందన్నాడు. హేజిల్‌వుడ్‌ ఇంటర్వ్యూ నేపథ్యంలో జట్టులో విభేదాలు ఉన్నాయని నిరూపితమైందని అంటున్నాడు. కాగా,  గులాబి బంతి టెస్టుల్లో హేజిల్‌వుడ్‌కు మంచి రికార్డు ఉంది. 2020-21లో భారత్‌తో గులాబి బంతి టెస్టులో అతడు 8 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. అయితే పక్కటెముకల నొప్పి కారణంగా రెండో టెస్టుకు అతడు దూరమయ్యాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. కానీ ఇందులో ఏదో మిస్టరీ ఉందన్నాడు గవాస్కర్. అలా మాట్లాడిన  కొన్ని రోజుల తర్వాత పక్కటెముకల నొప్పితో హేజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అంతేకాదు బహుశా సిరీస్‌కు కూడా దూరం కావొచ్చు. ఇలాంటివి ఒకప్పుడు మన క్రికెట్లో జరిగేవంటూ .. ఇప్పుడు ఆసీస్‌ వంతు వచ్చిందన్నాడు.

ఇది కూడా చదవండి: India U19 vs Japan U19: జపాన్‌పై భారత్‌ ఘనవిజయం

Pink Ball Test: ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు తలెత్తాయన్న వార్తలను ఆ జట్టు బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ కొట్టిపారేశాడు. పెర్త్‌ టెస్టులో వైఫల్యానికి పేసర్‌ హేజిల్‌వుడ్‌ బ్యాటర్లను నిందించడంతో.. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల మధ్య విభజన ఏర్పడినట్లు వార్తలొస్తున్నా హెడ్ మాత్రం అలాంటివేం లేవంటున్నాడు. ఊహాగానాల్ని పట్టించుకోవద్దు. మా బ్యాటర్లు, బౌలర్లపై భారీ అంచనాలున్నాయి. ఇది వ్యక్తిగతంగా నిరూపించుకోవాల్సిన అంశం. మా బౌలర్ల సత్తా ఏంటో మాకు తెలుసు. గతంలో ఎన్నో సార్లు జట్టును గట్టెక్కించారు. స్కోరుబోర్డుపై తగినన్ని పరుగులు సాధిస్తే మంచి స్థితిలో ఉండొచ్చని బ్యాటింగ్‌ బృందానికి తెలుసంటూ చెప్పుకొచ్చాడు హెడ్..

ALSO READ  Rohit Sharma: ప్రతి ఒక్కరికి యంగ్ కెప్టెన్ కావాలి.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!

కాగా, మరోవైపు బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. పింక్‌ బాల్‌ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్‌ లబుషేన్‌ త్రోడౌన్స్‌ వేస్తుండగా బ్యాటింగ్‌ చేస్తున్న స్మిత్‌ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్‌ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్‌ పరిస్థితిని పర్యవేక్షించాడు.

Pink Ball Test: అనంతరం స్మిత్‌ నెట్స్‌ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్‌ బ్యాటింగ్‌ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌ టెస్టుకు స్మిత్‌ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్‌ స్మిత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో స్మిత్‌ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110 మాత్రమే. ఇదిలా ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *