AP News: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ డెయిరా టెక్నాలజీ కళాశాలలో దారుణం చోటుచేసుకున్నది. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఘోర అవమానం జరిగింది. దీనికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ కారణమంటూ దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ వివక్షపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నది.
AP News: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ డెయిరా టెక్నాలజీ కళాశాలలో రవివర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన చాంబర్‌లో ఉన్న కుర్చీలను ఆ కళాశాల ప్రిన్సిపాల్ తొలగించారు. దీంతో అవమానభారంతో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ నేలపైనే కూర్చొని విధులు నిర్వహించారు. దళితుడినని తనపై ప్రిన్సిపాల్ వివక్ష చూపుతున్నారని రవివర్మ ఆరోపించారు.
AP News: అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మకు జరిగిన అవమానం గురించి తెలిసిన ఎస్సీ, ఎస్టీ, ఇతర ఉద్యోగ సంఘాలు, వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా ఆందోళనకు దిగేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. ఇలాంటి ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేస్తున్నదని మండిపడుతున్నారు.