News Ration Cards: ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.దీన్ని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున కార్డు రానివారికి కూడా చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెపింది. వారితో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: CPI Ramakrishna: గరుగుబిల్లిలో అక్రమ మైనింగ్ ఆపాలి.. పవన్ కల్యాణ్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
News Ration Cards: ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు పింఛన్లకు డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను తీసుకోనున్నారు. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ.. సంక్రాంతి 2025 కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది. దానికి సంబందించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.
One Reply to “News Ration Cards: ఏపీలో రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు”