Ap News

Election Code: ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. డిసెంబర్ 2 వరకు బదిలీలు, ప్రమోషన్లకు బ్రేక్.. సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ!

Election Code: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే డిసెంబర్ 2వ తేదీ వరకు ఎలాంటి ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లేఖ రాశారు.

ఒకవేళ అత్యవసర లేదా అనివార్య పరిస్థితుల్లో ఎవరినైనా బదిలీ చేయాల్సి వచ్చినా, పదోన్నతి కల్పించాల్సి వచ్చినా తప్పనిసరిగా ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూడటానికే ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. కోడ్ అమల్లో ఉన్నంత వరకు అధికారుల నియామకాలు, కదలికలపై నిఘా కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *