AP Cabinet Meet: ఈనెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పీ-4 అమలు సహా.. పలు అంశాలపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన చెత్తపన్ను రద్దుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. జల్ జీవన్ మిషన్, రాజధాని పునఃనిర్మాణం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏపీలో ఇటీవలి తిరుపతి లడ్డూ కు సంబంధించి రేకెత్తిన వివాదంపై కూడా క్యాబినెట్ చర్చించవచ్చు.
