Anushka Shetty: అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో జరిగిన ఓయధార్ధ సంఘటనాదారంగా ఈ సినిమా రాబోతుంది. ఇందులో అనుష్క బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారిన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా .. చాలా వరకు ముఖ్యమైన సీన్స్ కంప్లీట్ చేసుకుంది. ఏప్రిల్ 18న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఆంధ్రా-ఒడిశా బోర్టర్ అటవీ ప్రాంతంలోని సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట. అపుష్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటించిందిట. రియల్ లొకేషన్స్‌లో రియల్ స్టంట్స్ తో అదరగొట్టిందట. ఎలాంటి డూప్ లేకుండా నటించిందట. అందుకోసం అనుష్క ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందట. మరికొన్ని సీన్స్ అయితే ఏకంగా మావోయిస్టుల అడ్డా ప్రాంతమైన దంతెవాడ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారట. అనుష్క ఎక్కడా బయపడకుండా రిస్క్ లొకేషన్లలో సైతం షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.