Anushka Shetty

Anushka Shetty: అనుష్క ఘాటి రచ్చ.. 30 రోజుల్లో యాక్షన్ జాతర!

Anushka Shetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా మూవీ ‘ఘాటి’ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్క పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ఆమె పాత్ర రేంజ్‌ను సూచిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం జూలై 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. “అనుష్క యుద్ధం మరో 30 రోజుల్లో!” అంటూ ఈ పోస్టర్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఈ మూవీలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: Hari Hari Veeramallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా క్లైమాక్స్‌పై కొత్త అప్‌డేట్‌

Anushka Shetty: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని అంచనాలు నెలకొన్నాయి. రాబోయే అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Anushka Shetty: మరోసారి షాక్ ఇచ్చిన అనుష్క 'ఘాటీ'?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *