Anushka Sharma Virat Kohli: తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ 2011 నుండి 2025 వరకు తన 14 ఏళ్ల తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తుండిపోతాయంటూ అనుష్క తన పోస్టులో వెల్లడించారు. టెస్టు ఫార్మాట్‌పై నీవు చూపిన ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆమె తెలిపారు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు ఎంతో గొప్పగా తిరిగి వచ్చేవాడివి. నువ్వు ఎదిగిన విధానాన్ని పక్కన ఉండి చూడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అనుష్క చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. స్పందించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు!
ఏదో ఒక రోజు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని తెలుసు. కానీ, నువ్వు ఎల్లప్పుడూ నీ మనసు చెప్పిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటావు. ఆటలో ప్రతిదీ సాధించావు. గుడ్ బై చెప్పడానికి అర్హుడివని భావిస్తున్నానని అనుష్క శర్మ భావోద్వేగానికి లొనయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2017 నుండి కోహ్లీని వివాహం చేసుకున్న ఈ జంటకు వామిక, అకే అనే ఇద్దరు పిల్లలున్నారు. కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 9230 పరుగులు చేసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో వెస్టిండీస్‌పై జరిగిన అతి పొడవైన ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతను 2012లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 2025లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.
View this post on Instagram