Drugs Case: తమిళ సినీ రంగంలో మళ్లీ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఇటీవల కోలీవుడ్ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. అతడిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు విచారణ చేపట్టి ఎన్నో కీలక విషయాలు బయటపెట్టారు.
డ్రగ్స్ నెట్‌వర్క్‌కి తెరలేపిన శ్రీరామ్
ఈ నెల 23న, చెన్నై నుంగంబాకం పోలీసులు నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు డ్రగ్స్ తీసుకున్న ఇతరుల పేర్లు వెల్లడించాడు. అందులో ప్రముఖ నటుడు కృష్ణ పేరు బయటకు రావడంతో మరోసారి కలకలం రేగింది.
ఇది కూడా చదవండి: Kannappa: కన్నప్ప సంచలన రిలీజ్.. ఎన్ని వేల స్క్రీన్స్ లో అంటే?
పారిపోయిన నటుడు కృష్ణ
శ్రీరామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, నటుడు కృష్ణ కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విచారణకు రావాల్సిన కృష్ణ… అరెస్ట్ అయ్యే భయం తో కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
సినీ ప్రముఖులతో సంబంధాలు
నటుడు కృష్ణకు తమిళ సినీ రంగంలోని పలువురు యువ దర్శకులు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, టాలీవుడ్‌లోని కొంతమంది నటులతోనూ అతనికి సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇక ఎవరెవరి పేర్లు బయటపడతాయో?
ఈ కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. శ్రీరామ్, కృష్ణలతో పరస్పర సంబంధాలున్న ఇతర నటులు, టెక్నీషియన్లు కూడా ఈ కేసులో బయటపడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఇది మరోసారి డ్రగ్స్ వ్యవహారం పై ఆందోళన పెంచింది.