PM Modi-Congress: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పుతిన్ పర్యటనకు భారత్ రెడ్ కార్పెట్ సిద్ధం చేస్తుండగా, అదే రెడ్ కార్పెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీ అమ్ముతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చర్యపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది ప్రధానమంత్రిని అగౌరవపరిచే సిగ్గుచేటు చర్యగా అభివర్ణించింది.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
కాంగ్రెస్ నేత పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది?
కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ ఈ వివాదాస్పద ఏఐ-జనరేటెడ్ వీడియోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ, “ఇప్పుడు.. ఇది ఎవరు చేసారు?” అంటూ క్యాప్షన్ జతచేశారు.
ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేత నీలం రంగు కోటు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నారు. అంతర్జాతీయ వేదికపై అతిథికి స్వాగతం పలికే రెడ్ కార్పెట్‌పై, ఆయన ఒక చేతిలో టీ కెటిల్, మరొక చేతిలో టీ కప్పులు పట్టుకొని నడుస్తూ చాయ్ బోలో.. చాయ్యే (ఎవరికైనా టీ కావాలా)” అంటూ మోదీ గొంతుకను పోలిన వాయిస్ ఓవర్ వినబడింది. వెనుక అంతర్జాతీయ జెండాలు, త్రివర్ణ పతాకం కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. 10 ప్రత్యేక రైలు సర్వీసులు
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వీడియోను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీ మండిపాటు: “సిగ్గుచేటు చర్య”
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ‘చాయ్‌వాలా’ నేపథ్యాన్ని ఎగతాళి చేస్తూ ఏఐ వీడియోను సృష్టించడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
పార్లమెంట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ చర్యను ఖండించారు. ప్రధానమంత్రిని మరోసారి కాంగ్రెస్ అగౌరవపరిచింది, అని బీజేపీ ధ్వజమెత్తింది. అంతర్జాతీయ అతిథి రాక సందర్భంగా దేశ ప్రధానిని కించపరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటు చర్య అని కమలనాథులు మండిపడుతున్నారు.

