Devarakonda Brothers: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘EPIC’. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
1. అన్నయ్య స్లాట్‌లోకి తమ్ముడు!
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబలి’ సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరుగుతుండటంతో ముందు చెప్పిన రిలీజ్ డేట్‌కి రావడం కష్టమేనని ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తోంది.
దీంతో విజయ్ దేవరకొండ ఖాళీ చేసిన సెప్టెంబర్ 11 డేట్‌కి ఆనంద్ దేవరకొండ తన ‘EPIC’ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2. సెప్టెంబర్ రిలీజ్‌కే ఎందుకు ఓటు?
‘EPIC’ సినిమా ముందుగా మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ జులైకి వాయిదా పడింది. ‘లెనిన్’ ఇంక ‘EPIC’ సినిమాలకు ఒకే నిర్మాతలు కావడంతో మొదట ‘లెనిన్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. దీంతో నిర్మాతల ఫోకస్ మొత్తం లెనిన్ సినిమా పైన ఉండడంతో ‘EPIC’ సినిమా ప్రొమోషన్స్ తగ్గించారు. చివరికి లెనిన్ జూలై 10 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘EPIC’ రిలీజ్ పైనా దృష్టి పెట్టారు నిర్మాతలు. ఇంకా ఆగస్టు నెలలో రిలీజ్ చేద్దాం అనుకుంటే ఇప్పటికే పెద్ద సినిమాలు క్యూలో ఉండటంతో, రద్దీ లేని సెప్టెంబర్ 11 సరైన సమయమని భావించి ఆ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
3. మళ్లీ హిట్ కాంబో రిపీట్ కాబోతుందా?
ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, దర్శకుడు ఆదిత్య హాసన్ అందరూ మంచి హిట్ ఫామ్‌లో ఉన్నారు. సరిగ్గా ప్రమోషన్లు నిర్వహించి విడుదల చేస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
