Brahma Anandam

Brahma Anandam: ఆకట్టుకుంటున్న బ్రహ్మా ఆనందం ట్రైలర్!

Brahma Anandam: టాలీవుడ్ టాప్ కమెడియన్ మీమ్ గాడ్ బ్రహ్మానందం నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌తో సాగింది.

Also Read: Mahakumbh Mela 2025: మ‌హాకుంభ‌మేళా వెళ్లే భ‌క్తుల‌కు బిగ్‌ అప్‌డేట్స్‌

ఈ ట్రైలర్‌లో బ్రహ్మ నందం, రాజా గౌతమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా పలికించిన తీరు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత బ్రహ్మానందం నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

BrahmaAnandam – Official Trailer:

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health: రోజూ ఎంత దూరం నడిస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *