Amit Mishra

Amit Mishra: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అమిత్ మిశ్రా

Amit Mishra: భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 42 ఏళ్ల వయసులో, సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఆయన ముగింపు పలికారు. ఈ నిర్ణయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అమిత్ మిశ్రా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2017లో ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయినా, దేశవాళీ క్రికెట్ మరియు ఐపీఎల్‌లో చురుగ్గా కొనసాగాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్స్ సాధించిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. : ఆయన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాడు.

Also Read: Matthew Breetzke: మాథ్యూ బ్రీట్జ్కే ఆల్ టైమ్ రికార్డు

భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేయడం ద్వారా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించాలని మిశ్రా తెలిపారు. మిశ్రా 2003లో వన్డే అరంగేట్రం చేశాడు. 2008లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతను భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టుల్లో 76, వన్డేల్లో 64, టీ20లలో 16 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో మిశ్రా అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. అతను మూడు హ్యాట్రిక్స్ సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ హ్యాట్రిక్స్ మూడు వేర్వేరు జట్ల తరఫున (ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ XI పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్) నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అతను మొత్తం 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు తీశాడు. తన కెరీర్‌లో ఒకానొక సమయంలో జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యానని అమిత్ మిశ్రా వెల్లడించాడు. ఆ సమయంలో ఒక సంవత్సరం పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *