America:

America: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాలా రూ.237 కోట్లు

America: అమెరికాకు చెందిన న‌టి, గాయ‌కురాలు జూడి గ‌ర్లాండ్ ఓ సినిమాలో ధరించిన రూబీ చెప్పుల‌ను తాజాగా వేలం వేశారు. ది విజార్డ్ ఆఫ్ ఓజ్ చిత్రంలో ధ‌రించిన ఈ రూబీ చెప్పులకు ఏకంగా 28 మిలియ‌న్ డాల‌ర్ల ధ‌ర ప‌లికింది. అంటే మ‌న రూపాయ‌ల్లో రూ.237 కోట్లు అన్న‌మాట‌. దాదాపు 20 సంవ‌త్స‌రాల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధ‌ర ప‌ల‌క‌డం విశేష‌మే మ‌రి.

America: మెన్నెసొటాలోని ఓ మ్యూజియంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన ఈ చెప్పులు 2005తో చోరీకి గుర‌య్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వాటిని తాజాగా వేలంలో ఉంచ‌గా ఈ రికార్డు ధ‌ర ప‌లికింది. ఇన్నేండ్లు దాటిన త‌ర్వాత కూడా ఆ చెప్పుల‌కు అంతగా ఆద‌ర‌ణ ఉండ‌టం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  USA: న్యూ ఓర్లీన్స్ ఐఎస్ ఉగ్రవాది దాడి.. 15 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *