Amaravathiki Aahwanam

Amaravathiki Aahwanam: ‘అమరావతికి ఆహ్వానం’ గ్లింప్స్ సంచలనం.. ధన్య బాలకృష్ణ డైలాగ్‌తో అంచనాలు రెట్టింపు!

Amaravathiki Aahwanam: టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ జోనర్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. ధన్య బాలకృష్ణ ఇంటెన్స్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: The Raja Saab Twitter Review: ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ: థియేటర్లలో ప్రభాస్ పూనకాలు..!

ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం రూపొందింది. జివికె దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అశోక్ కుమార్, భద్రమ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ధన్య బాలకృష్ణ చెప్పిన డైలాగ్ “కీటక మరణం..కప్ప జీవనాధారం, కప్ప మరణం..పాము జీవనాధారం, ఈ సృష్టి మొత్తం..జనన మరణ పోరాటం..ఒకరి గెలుపు మరొకరి అంతం” సినిమాపై అంచనాలు పెంచింది. ధన్య బాలకృష్ణ తొలిసారి హై ఇంటెన్సిటీ పాత్రలో కనిపించనుంది. జె ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాయిబాబు తలారి ఎడిటింగ్, పద్మనాభ్ బరద్వాజ్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలో థియేటర్లలో భారీ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *