Amaran: ప్రిన్స్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘అమరన్’. ఈ నెల 31న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ ముకుంద వరదరాజన్ పాత్రను ఇందులో తాను పోషించానని, ఇది చిరస్థాయిగా నిలిచే చిత్రమని శివ కార్తికేయన్ చెప్పారు. ఈ సినిమాను రెండు రోజుల క్రితం ఆర్మీ పర్సన్స్ కు చూపించినప్పుడు ఇది చాలా రియలిస్టిక్ గా ఉందని అభినందించారని సాయిపల్లవి తెలిపింది. సాయిపల్లవి ఇంట్రో టీజర్ చూశాక ఈ మూవీ తప్పకుండా చూడాలని డిసైడ్ అయ్యానని నాగ అశ్విన్ అన్నారు. ఇలాంటి స్టోరీ చేయాలంటే పేషన్ ఉండాలని, కమల్ హాసన్ ఈ సినిమా నిర్మాత కావడం గొప్ప విషయమని నాగ అశ్విన్ చెప్పారు. ‘అమరన్’ సినిమాను తెలుగులో సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా పాల్గొన్నారు.
