AlluArjun - Trivikram

AlluArjun – Trivikram: బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది అప్పుడే!

AlluArjun – Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొని ఉంది. అసలు ఈ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో షురూ కావాల్సి ఉంది.. కానీ అది ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. ఈ గ్యాప్‌లో దర్శకుడు అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రూమర్స్ షికారు చేస్తున్నాయి.ఇదొక్కటే కాదు.. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఏ హీరో గానీ, డైరెక్టర్ గానీ టచ్ చేయని ఓ ఫాంటసీ సబ్జెక్ట్‌ను అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: Jana Nayagan: భారీ ధరకి ‘జన నాయగన్’ ఓటిటి రైట్స్!

AlluArjun – Trivikram: ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజా అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం.. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుందట. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్‌లో ఈ సాలిడ్ అప్‌డేట్‌ను వెల్లడించారు. సో.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ నుంచి ట్రాక్‌లోకి రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *