Allu Arjun

Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?

Allu Arjun: అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్ తన గర్ల్ ఫ్రెండ్ నయనిక రెడ్డిని మార్చి 6న పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి నాలుగు రోజుల ముందే ప్రీ-వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుండి మలయాళ ఇండస్ట్రీ వరకు సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ పార్టీకి వచ్చిన అతిథులందరిని అల్లు అర్జున్ స్వయంగా స్వాగతం పలికారు.

ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ తాను ప్రస్తుతం పనిచేస్తున్న డైరెక్టర్ అట్లీని, సుకుమార్‌కు పరిచయం చేశారు. ఇక్కడే మరో ఇద్దరు అతిథులు అందరినీ ఆకర్షించారు. వారు ఎవరో కాదు.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంకా మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్. వీరు ఈ ఫంక్షన్‌కు రావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముందుగా బాసిల్ జోసెఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఆయనతో అల్లు అర్జున్ గతంలో ఓ సూపర్ హీరో సినిమా చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో బాసిల్ జోసెఫ్, టోవినో థామస్‌తో ‘మిన్నల్ మురళి’ సినిమా తీయడంతో.. అల్లు అర్జున్‌తో చేయాల్సిన కథనే టోవినోతో చేశారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు బాసిల్ జోసెఫ్ ఈ ఫంక్షన్‌కు రావడంతో, అల్లు అర్జున్ కోసం ఆయన మరో కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారని, అందుకే ఇక్కడికి వచ్చారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు సందీప్ రెడ్డి వంగ ఈ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో ఎంతో చనువుగా ఉండటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. సందీప్‌కు కూడా అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను అల్లు అర్జున్‌తోనే తీయాలని అనుకున్నారు కానీ అప్పట్లో అది కుదరలేదు.

ప్రస్తుతానికి అల్లు అర్జున్, అట్లీ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పాడుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో కూడా అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారు. వీటన్నిటినీ పూర్తి చేసిన తర్వాతే సందీప్ రెడ్డి వంగ మరియు బాసిల్ జోసెఫ్‌లతో సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *