Allu Sirish: మెగా కాంపౌండ్ మరియు అల్లు వారి అభిమానులకు ఇది నిజంగానే పెద్ద పండగ లాంటి వార్త. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన సుదీర్ఘ కాలపు ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు శిరీష్ సిద్ధమయ్యాడు. సోమవారం (డిసెంబర్ 29) ఈ విషయాన్ని ఒక క్యూట్ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ తన పెళ్లి తేదీని వెల్లడించాడు.
అయాన్, అర్హలతో కలిసి వెరైటీ అనౌన్స్మెంట్
సాధారణంగా పెళ్లి ప్రకటనలు అంటే ప్రెస్ నోట్స్ లేదా కార్డ్స్ చూస్తుంటాం. కానీ శిరీష్ మాత్రం తన అన్న అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఒక ట్రెండీ ఇన్ స్టాగ్రామ్ రీల్ ద్వారా డేట్‌ను అనౌన్స్ చేశాడు. “బాబాయ్ పెళ్లి ఎప్పుడు?” అని పిల్లలు అడగ్గా.. “మార్చి 6” అని శిరీష్ సమాధానమిచ్చాడు. అయితే సంగీత్ ఎప్పుడు అని అడిగితే.. “మనం పక్కా సౌత్ ఇండియన్స్ కదా, అలాంటి హడావిడి మనకు ఎందుకు” అంటూ ఫన్నీగా శిరీష్ ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చదవండి: Peddi: అప్పలసూరి’గా జగపతిబాబు.. ఫస్ట్ లుక్ విడుదల!
అన్న మ్యారేజ్ డేనే తమ్ముడి పెళ్లి కూడా!
అల్లు శిరీష్ వెడ్డింగ్ డేట్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ దాగుంది. తన అన్న అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం 2011, మార్చి 6న జరిగింది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే తేదీన అంటే.. 2026, మార్చి 6న శిరీష్ తన ప్రియురాలు నయనిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఒకే ఇంట్లో అన్నదమ్ముల పెళ్లి రోజులు ఒకటే కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
వరుణ్ తేజ్ పెళ్లిలో మొదలైన లవ్ స్టోరీ
శిరీష్, నయనికల ప్రేమకథ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు హీరో నితిన్ భార్య షాలిని తన స్నేహితురాలు నయనికతో కలిసి హాజరయ్యారు. అక్కడే శిరీష్‌కు నయనికతో తొలి పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారి, చివరకు పెళ్లి పీటల వరకు చేరింది. 2025 అక్టోబర్‌లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరగ్గా, ఇప్పుడు అధికారికంగా పెళ్లికి ముహూర్తం ఖరారైంది.
SAME FAMILY… SAME DATE#AlluSirish @AlluSirish announces his wedding on March 6. A heartfelt coincidence as it matches #AlluArjun & Sneha Reddy’s wedding day. #TeamAAWarangal @AIAFA_Warangal@AAFAOnline @imsarathchandra @alluarjun @TrendsAlluArjun pic.twitter.com/343jCfpiSy
— WGL AlluArjun Fans & Welfare Association (@AIAFA_Warangal) December 29, 2025
