Allu Kanakaratnam: టాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి అల్లు కనకరత్నమ్మ (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె ఉదయం 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
అల్లు కనకరత్నమ్మ గారు ప్రముఖ నటుడు, హాస్యచక్రవర్తి అల్లు రామలింగయ్య గారి సతీమణి కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ. ఈ వార్త తెలిసి సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.
ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తుదిదర్శనానికి హాజరవుతున్నారు. ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్ బయలుదేరగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ నుంచి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.
అన్ని ఏర్పాట్లను నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కనకరత్నమ్మ గారి మరణవార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

