Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ కొత్త భారీ ప్రాజెక్ట్.. ప్రశాంత్ నీల్‌తో జోడీ!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్-వరల్డ్ స్థాయి భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ లైనప్‌లో మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే, గతంలో టాక్ వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా ప్రస్తుతానికి ఆగినట్లు తెలుస్తోంది. మరోవైపు, సందీప్ రెడ్డి వంగతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా హోల్డ్‌లో ఉందని సమాచారం.

Also Read: Akhanda 2: ‘అఖండ 2 – తాండవం’ టీజర్‌తో రికార్డులు సృష్టించిన బాలయ్య!

Allu Arjun: ఇదిలా ఉంటే, లేటెస్ట్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ ఓ భారీ చిత్రం కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మాత దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కే బన్నీ హీరోగా ఖరారైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కాంబో నిజమైతే, అభిమానులకు పండగే! కానీ, ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *