Allu Arjun: కొడుకంటే తండ్రికి ప్రేమ ఉండటం సహజం. అలానే కొడుక్కీ తండ్రి పట్ల హీరోవర్షిప్ ఉండటం సహజం. అదే అల్లు అర్జున్, అతని కొడుకు అయాన్ మధ్య కూడా ఉంది. ‘పుష్ప-2’ సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు అయాన్ తన తండ్రికి రాసిన ఓ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బన్నీ. ‘పుష్ప’ కోసం ఐదేళ్ళుగా తన తండ్రి పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూసిన అయాన్ తన అభిప్రాయాన్ని వాక్యాల రూపంలో వ్యక్తం చేసిన తీరు చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. తండ్రి పట్ల అయాన్ కు ఇంత ప్రేమ ఉందా!? అని ఆశ్చర్య పోయారు. మొన్న హైదరాబాద్ లో జరిగిన ‘పుష్ప-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ హాజరై అందరి దృష్టిలో పడిన అయాన్… ఇప్పుడీ లేఖతో నెటిజన్స్ మనసుల్ని కొల్లగొట్టేశాడు.

