Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్‌ను తన స్టాఫ్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్టాఫ్‌తో కలిసి కేక్ కట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ హార్ట్ టచింగ్ పోస్ట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Also Read: Sahakutumbanam Review: ”సఃకుటుంబానాం” సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నూతన సంవత్సరాన్ని తన స్టాఫ్‌తో కలిసి ఆనందంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ టీమ్ అధికారిక అకౌంట్ నుంచి షేర్ చేశారు. స్టాఫ్‌తో కలిసి కేక్ కట్ చేస్తూ, ఆనందంగా పోజులిచ్చిన బన్నీ ఫొటోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ప్రయాణంలో తోడుగా నిలిచిన స్టాఫ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనసును ఆకర్షించే వ్యక్తిత్వం కలిగిన అల్లు అర్జున్ తనతో పనిచేసే వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడని సినీ వర్గాల్లో పేరుంది. ఈ స్వాగ్ పార్టీలో స్టాఫ్ అందరూ పాల్గొని న్యూ ఇయర్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘స్టాఫ్‌ను కుటుంబంలా చూడటమే బన్నీ స్పెషాలిటీ’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘పుష్ప 2’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్#Alluarjun @alluarjun 🤍✨#HappyNewYear2026 pic.twitter.com/w2YsMq6026
— Sreenivas Gandla (@SreenivasPRO) January 2, 2026
