Allu Arjun: గద్దర్ అవార్డు పొందిన అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..

Allu Arjun: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇటీవల గద్దర్ అవార్డు వరించుకున్నారు. ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డు తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని అన్నారు.

“తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని అల్లు అర్జున్ తెలియజేశారు. తనను ఈ గొప్ప గౌరవానికి అర్హుడిగా గుర్తించినందుకు ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విజయానికి తనకంటే ఎక్కువ క్రెడిట్ దర్శకుడు సుకుమార్ మరియు చిత్ర నిర్మాతలదేనని  తెలిపారు. “సుకుమార్ గారు చూపించిన దిశ, నిర్మాతల మద్దతు లేకపోతే ఈ విజయాన్ని సాధించలేనని” చెప్పారు.

తన గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నానని, “మీరు చూపించే ప్రేమ, మద్దతు నాలో ఎప్పటికీ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి” అని చెప్పారు. అభిమానుల ప్రేమే తన ప్రేరణ అని తెలిపారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. గద్దర్ అవార్డు ద్వారా ఆయన నటనకు లభించిన గుర్తింపు సినీ రంగాన్ని కూడా గర్వించజేసే అంశంగా మారింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *