War 2: యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వార్ 2’ నుంచి సంచలన అప్డేట్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ మూవీ ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ కాకముందే నేరుగా టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేలోనే టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఎన్టీఆర్ బర్త్‌డే (మే 20) సందర్భంగా లేదా నెలాఖరులో ఈ టీజర్ అభిమానులకు కానుకగా వస్తుందని బజ్ వినిపిస్తోంది. ఈ టీజర్‌తో ఎన్టీఆర్, హృతిక్ ల డైనమిక్ లుక్‌ను ఆవిష్కరించే అవకాశం ఉందని టాక్. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. టీజర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
