Alia Bhaat

Alia Bhaat: అలియా భట్ మనసు దోచేసిన సౌత్ స్టార్?

Alia Bhaat: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముఖ్య అతిథిగా విచ్చేసి, అక్కడి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక దక్షిణ భారత నటుడి ప్రతిభను ఆమె కొనియాడారు. ఆ నటుడు ఎవరో తెలుసా? అతనే పుష్ప విలన్‌ ఫహాద్ ఫాజిల్! “ఫహాద్ నా ఫేవరెట్ నటుల్లో ఒకరు. ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా ‘ఆవేశం’ సినిమా నాకు ఎంతో ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్ధం” అని అలియా అన్నారు. ఇప్పుడు భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, కరోనా సమయంలో సినిమా పరిశ్రమ ఒకే కుటుంబమని తెలిసిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం అలియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *