Alia Bhatt: బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ముంబైలో జరిగిన ‘ఉమ్రావ్ జాన్’ స్పెషల్ స్క్రీనింగ్‌లో రేఖా యొక్క ఐకానిక్ ‘సిల్సిలా’ లుక్‌ను రీక్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రేఖా నటించిన 1981 కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ఉమ్రావ్ జాన్’ రీ-రిలీజ్ సందర్భంగా జరిగిన స్క్రీనింగ్‌లో ఆలియా, రియా కపూర్ స్టైలింగ్‌లో లైట్ పింక్ సారీలో అద్భుతంగా కనిపించారు. ఫెదర్ ఇయర్ రింగ్స్, డ్యూ మేకప్, వదులుగా ఉన్న జుట్టుతో రేఖా ‘సిల్సిలా’లో చాందిని పాత్రను గుర్తుచేశారు. ఈ లుక్‌కు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే రేఖా కూడా ఈ ఈవెంట్‌లో గోల్డ్-వైట్ లెహెంగాలో మెరిసి, అందరినీ ఆకట్టుకున్నారు. ఈ స్క్రీనింగ్‌కు టబు, అమీర్ ఖాన్, జాన్వీ కపూర్, హేమమాలిని వంటి స్టార్స్ హాజరయ్యారు. అయితే ఆలియా ఈ లుక్‌తో రేఖా లెగసీని నాస్టాల్జియాను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#AliaBhatt’s nod to #Rekha’s #Silsila charm at last night’s Umrao Jaan screening.😍#Celebs pic.twitter.com/XNJwzPfJ7u
— Filmfare (@filmfare) June 27, 2025