Shiva Re-Release

Shiva Re-Release: అక్కినేని నాగార్జున ఐకానిక్ హిట్ ‘శివ’ రీరిలీజ్? థియేటర్లలో మళ్లీ హవా?

Shiva Re-Release: తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన అక్కినేని నాగార్జున బ్లాక్‌బస్టర్ చిత్రం ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒకప్పుడు తెలుగు సినిమాలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఇప్పుడు ఈ ఐకానిక్ మూవీని మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఈ రీరిలీజ్ కోసం మేకర్స్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ‘శివ’ రీరిలీజ్ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా ప్రింట్‌ను అద్భుతమైన రీమాస్టరింగ్‌తో అదిరిపోయే క్వాలిటీలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రీరిలీజ్ గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ కల్ట్ హిట్‌ను మళ్లీ థియేటర్లలో రిలీవ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *