Lenin: అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) రూపొందిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, ఈ సినిమా బృందం కీలక షెడ్యూల్ కోసం తిరుపతికి బయలుదేరనుంది. లొకేషన్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. అఖిల్ ఈ చిత్రంలో చిత్తూరు యాసలో పూర్తి మాడ్యులేషన్‌తో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, వీరి జోడి లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని అంటున్నారు. నవంబర్ 14న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
