Lenin

Lenin: టాప్ లేచిపోయేలా అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్!

Lenin: అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన తాజా చిత్రం ‘లెనిన్’ కోసం జోరుగా షూటింగ్ జరుపుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు యాసతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం తిరుమల కొండల నేపథ్యంలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సన్నివేశం చిత్రంలోనే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. స్థానికతను ప్రతిబింబించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నాయి. అఖిల్ తన పాత్ర కోసం చిత్తూరు యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పించనున్నాడు.

ఈ చిత్రంలో అందాల తార శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇద్దరి మధ్య లవ్ సీన్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చిత్ర బృందం ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్-శ్రీలీల జోడీ, రాయలసీమ నేపథ్యం, భారీ సెట్‌లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kuppam Municipal Election: ఈ నెల 28న కుప్పంలో ఏం జరగబోతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *