Akhil Akkineni: అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్థం నవంబర్ 26న జరిగింది. ఈ వేడుక తమ ఇంటిలోనే రెండు కుటుంబాల సభ్యుల సమక్షంలో జరిగిందని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతకాలంగా అఖిల్… జైనాబ్ తో ప్రేమలో ఉన్నారని, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాక వివాహ నిశ్చితార్థం చేశామని నాగార్జున అన్నారు. వచ్చే యేడాది పెళ్లి ఉంటుందని తెలిపారు. జైనాబ్ స్క్రిన్ వ్యాపార రంగంలో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, దుబాయ్, లండన్ లో ఆమె జీవితం గడిచిందని, జైనాబ్ తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామని నాగ్ చెప్పారు. 2016లో అఖిల్ నిశ్చితార్థం శ్రియా భూపాల్ తో జరిగినా… ఆ తర్వాత అది రద్దు అయ్యింది. మళ్ళీ ఇంతకాలానికి అఖిల్ వివాహ నిశ్చితార్థం జరుపుకోవడం విశేషం.