Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో సూపర్ హిట్ ‘అఖండ’ తర్వాత, ‘అఖండ 2 – తాండవం’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జార్జియాలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించిన బాలయ్య, ఇప్పుడు మరో కీలక షెడ్యూల్ కోసం సిద్ధమయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్‌గా రూపొందించిన సెట్‌లో ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది.
Also Read: Madhoo: ముద్దు సన్నివేశంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు?
Akhanda 2 : ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంతో క్రూసియల్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బోయపాటి మార్క్ యాక్షన్, డ్రామాతో ‘అఖండ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా మరింత గ్రాండ్‌గా రూపొందుతోందని యూనిట్ సభ్యులు ధీమాగా చెబుతున్నారు. రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.