Ajith Kumar: అజిత్ హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఒకటి ‘విడాముయర్చి’ కాగా మరొకటి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులో మొదటిసినిమా దీపావళికి, రెండో సినిమా పొంగల్ కు రావాల్సి ఉంది. అయితే లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘విడాముయర్చి’ దీపావళికి రాలేదు. పొంగల్ కు వస్తుందనే ప్రకటన ను ఇటీవలే వారు విడుదల చేశారు. దాంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పొంగల్ కు తమ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకుని, ‘విడాముయర్చి’కి చోటిచ్చింది.
ఇది కూడా చదవండి: Defense: హైపర్‌సోనిక్, AI, రోబోటిక్స్…2025కి సేన ప్లాన్ ఏమిటి?
Ajith Kumar: కానీ ఇప్పుడు హఠాత్తుగా తమ చిత్రాని పొంగల్ కు రిలీజ్ చేయడం లేదని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఇది నిజంగా అజిత్ అభిమానులను కలవరపెట్టే అంశమే. మరి ఇప్పటికిప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రిలీజ్ చేస్తుందా? అనేది సందేహం. ఒకవేళ అజిత్ సినిమా ఏదీ పొంగల్ కు రాకపోతే… తమిళనాడులో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు కలిసివస్తుంది. శంకర్ దానికి దర్శకుడు కావడం వల్ల ఈ చిత్రానికి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.