Venkatesh Iyer: కెప్టెన్లను రిటైన్ చేసుకోకపోవడంతో ఈసారి ఐపీఎల్ జట్లు కొన్ని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో జట్టును విజేతగా నిలబెట్టినప్పటికీ.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకుంది కోల్‌కతా. దీంతో ఇప్పుడు కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో రికార్డు ధర చెల్లించి కొనుక్కున్న వెంకటేశ్ అయ్యర్ ను కాదని రహానేకు పగ్గాలు అప్పగించనున్న తెలుస్తోంది.
Venkatesh Iyer: మెగా వేలంలో మంచి ఆటగాళ్లను ఎంచుకున్నా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ ఎవరన్నది పెద్ద సమస్యగా మారింది. అన్ని కోణాల్లో ఆలోచిస్తూ కోల్‌కతా జట్టు కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సీనియారిటీ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో భారీ మొత్తానికి తిరిగి సొంతం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. సీనియర్ అయిన అజింక్య రహానెకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తాజా సమాచారం.
Venkatesh Iyer: ఇటీవల జరిగిన మెగా వేలంలో కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. అదే సమయంలో రహానెను రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది. భారీ మొత్తానికి దక్కించుకున్న అయ్యర్ కంటే.. ఎంతో అనుభవమున్న రహానెకు వచ్చే సీజన్ జట్టు బాధ్యతలను అప్పగించాలని ఫ్రాంచైజీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో రహానె ఇప్పటికే నిరూపించుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్ గా గతంలో పలుసార్లు ముందుండి నడిపించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కోల్‌కతా కెప్టెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Venkatesh Iyer: ప్రస్తుతానికి రహానెకు కోల్‌కతా కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ 90 శాతం ధ్రువీకరణకు వచ్చింది. సారథ్య బాధ్యతల కోసమే అతడిని వేలంలో తీసుకున్నట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. కాగా, కెప్టెన్సీ రేసులో తానూ ఉన్నట్లు వెంకటేశ్ అయ్యర్ గతంలో చెప్పాడు. కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తే.. స్వీకరించడనాకి ఎంతో సంతోషంగా ఉన్నట్లు నితీశ్ రాణా లేనప్పుడు గతంలో జట్టును పలుసార్లు ముందుండి నడిచిపించిన అనుభవంతో జట్టును నడిపిస్తానని అన్నాడు. అయితే.. వచ్చే సీజన్‌కు రహానెకు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి, వెంకటేశ్‌కు వైస్ కెప్టెన్సీని ఇవ్వాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆ జట్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించనుందే చూడాలి.