Ajay Devgn:

Ajay Devgn: హైద‌రాబాద్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫిల్మ్‌సిటీ.. ఏ త‌ర‌హాలో ఉంటుందో తెలుసా?

Ajay Devgn: హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో మ‌రో ఫిల్మ్‌సిటీ మెర‌వ‌నున్న‌ది. ఇప్ప‌టికే రామోజీ ఫిల్మ్‌సిటీ అంత‌ర్జాతీయ ఖ్యాతిని ద‌క్కించుకున్న‌ది. ఇదే గాక సార‌ధి, అన్న‌పూర్ణ‌, రామానాయుడు త‌దిత‌ర సినీ నిర్మాణానికి అనువైన స్టూడియోలు ఎన్నో ఉన్నాయి. మ‌రెన్నో లోకేష‌న్ల‌తో స‌ర్వాంగ సుంద‌ర‌మైన న‌గ‌రంగా హైద‌రాబాద్ అనుకూలంగా ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి ముందుకొచ్చారు.

Ajay Devgn: హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌పంచ‌స్థాయి ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఓయూ) కుద‌ర్చుకోనున్నారు. హైద‌రాబాద్‌ను హాలీవుడ్‌, బాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హ‌బ్‌గా తీర్చిదిద్దాల‌ని అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి త‌న సంక‌ల్పంగా ప్ర‌క‌టించారు. అన్ని రంగాల్లో హైద‌రాబాద్‌ను అగ్ర‌గామిగా ఉంచుతాన‌న్న ధ్యేయం పెట్టుకున్న‌ట్టు చెప్పారు.

Ajay Devgn: ముఖ్యంగా డిసెంబ‌ర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్న‌ది. ఈ స‌మ్మిట్‌లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి కూడా ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఉన్న‌ది. దీనిలో భాగంగానే న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో జ‌రిగే ఒప్పందంపై తెలంగాణ ప్ర‌భుత్వం సంత‌కాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది.

Ajay Devgn: అజ‌య్ దేవ‌గ‌ణ్ నిర్మించ‌నున్న ఫిల్మ్‌సిటీలో యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్‌, ఏఐ ఆధారిత అత్యాధునిక స్టూడియో నిర్మాణం, ప్ర‌పంచ‌స్థాయి సినిమా చిత్రీక‌ర‌ణ‌కు ఏర్పాట్లు, సినీరంగానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాల కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఇదే స‌మ‌యంలో సినిమా, మీడియా రంగానికి తాను తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్‌గా సేవ‌లు అందిస్తాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌క‌టించారు.

Ajay Devgn: అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాణం జ‌రిగితే యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగావ‌కాశాలు దొరుకుతాయి. దేశ‌, విదేశీ చిత్ర నిర్మాణ సంస్థ‌లు త‌మ చిత్రాల‌ను నిర్మించే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. క్రియేటివ్ ప‌రిశ్ర‌మ‌కు కొత్త అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఈ నిర్మాణ సంస్థ ఏర్పాటైతే హైద‌రాబాద్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌పంచ స్థాయికి ఎదుగుతుంది.. అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *