Air India flight: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విమానాలకు చిన్నపాటి అనుమానం వచ్చినా జాగ్రత్తలు పడుతున్నారు. ఆకతాయిల పనులకూ జాగ్రత్తలు చూసుకోవాల్సి వస్తున్నది. ప్రమాదాలు జరుగుతాయేమోన్న సంకోచంతో విమానాలు తటపటాయిస్తున్నాయి. థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్లీ వెనక్కి మళ్లి పోయింది.
Air India flight: థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అండమాన్ సముద్రంపై ఆ విమానం పలుమార్లు చక్కర్లు కొట్టింది. ప్రయాణికుల్లో భయాందోళనతోపాటు పైలెట్, ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు కూడా ఆ విమానాన్ని వెనక్కి రప్పించారు. దీంతో పైలెట్ విమానాన్ని మళ్లీ థాయ్‌లాండ్‌లో సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

