Air India flight: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో విమానాల్లో ప్రయాణించాలంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి నడిపే పైలెట్లు కూడా భయాందోళనలతోనే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (జూన్ 13) మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ముప్పును ముందే పసిగట్టింది. ముంబై నుంచి లండన్ బయలుదేరి ఆ విమానం మూడు గంటలపాటు గాలిలోనే తచ్చాడి మళ్లీ వెనక్కి తిరిగి ముంబైలోనే సేఫ్ ల్యాండయింది.
Air India flight: ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా (ఏఐసీ 129) విమానం జూన్ 13న ఉదయం 5.39 గంటలకు లండన్‌కు బయలుదేరింది. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో పలుచోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇరాన్ తన గగనతలం మూసివేయడంతో పలు విమానాలను దారిమళ్లించారు.
Air India flight: ఈ దశలో విమాన పైలెట్లు ఎయిర్ ఇండియా విమానాన్ని మూడు గంటల పాటు గాల్లోనే తిప్పారు. మూడు గంటల అనంతరం తిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయానికే వచ్చి ల్యాండయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురయ్యారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఏఐసీ 129 విమానం తిరిగి రావడంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.