Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల నిజమైన కారణాలను వెలికితీయడంలో కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్‌లు.. ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్) మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) లభ్యమయ్యాయని అధికారులు ప్రకటించారు.
ఈ రెండు పరికరాలు విమానంలో చివరి క్షణాల్లో ఏం జరిగిందన్న దానిపై పూర్తి ఆధారంగా సమాచారాన్ని అందిస్తాయి. ఎఫ్‌డీఆర్‌లో విమానం వేగం, ఎత్తు, ఇంధన స్థాయి వంటి డేటా నిల్వ ఉండగా, సీవీఆర్‌లో పైలట్ల మధ్య సంభాషణలు, అలారాల శబ్దాలు వంటి అంశాలు రికార్డవుతాయి. ఇవి కలిసి ఈ ఘటన వెనుక ఉన్న అసలైన కారణాలను తెలుసుకునేందుకు కీలక ఆధారాలుగా మారనున్నాయి.
ఇది కూడా చదవండి: Benjamin Netanyahu: ట్రంప్‌ను చంపడానికి ప్లాన్ లు వేస్తున్నారు.. ఇజ్రాయెల్ ప్రధాన కీలక వ్యాఖ్యలు
దర్యాప్తు బృందాలకు ఊరట
ముందుగా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారులు ఎఫ్‌డీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, సీవీఆర్ కూడా దొరకడంతో దర్యాప్తు మరింత దిశగా పయనించనుంది. నిపుణుల అంచనాల ప్రకారం, డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి గల ప్రధాన కారణాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చని అంచనా.
ప్రధానమంత్రి కార్యదర్శి ఘటన స్థలానికి పర్యటన
ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందన చూపింది. ప్రధానమంత్రి కార్యదర్శి పీకే మిశ్రా నిన్న విమాన ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మిశ్రా, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీస్, AAIB అధికారులు ఆయనికి వివరించారు.
అంతేకాక, మృతుల కుటుంబ సభ్యులను సివిల్ ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన, డీఎన్‌ఏ నమూనాల సేకరణను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించాలని, గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.