Suriya: తమిళ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి డైరెక్టర్ ఆర్.జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటించనున్నట్లు సమాచారం.
ఇక సినిమా కెరీర్‌తో పాటు సామాజిక సేవలోనూ సూర్య ముందుంటారు. ఆయన నిర్వహిస్తున్న “అగరం ఫౌండేషన్” విద్య కోసం నిరంతరం సేవలందిస్తోంది. తాజాగా ఫిబ్రవరి 16న చెన్నైలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సూర్య, ఈ సందర్భంగా భావోద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యాలయం తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే నిర్మించానని, దాతలు ఇచ్చే విరాళాలన్నీ విద్య కోసం మాత్రమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు.
Also Read: Viral News: మూడు రోజులు అక్కడ, మూడు రోజులు ఇక్కడ, ఒక రోజు సెలవు.. భర్తను పంచుకుంటున్న ఇద్దరు భార్యలు
ఈ వేడుకకు సూర్య తన భార్య జ్యోతిక, కుమార్తె దియా, కుమారుడు దేవ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. విద్యే దేవుడు అని, విద్య ఒక రక్షణ కవచం అని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిలో విశేషమైన స్పందన పొందుతున్నాయి.

