Hyderabad: తెలంగాణలో వచ్చిన భూకంపం జనాలను భయాందోళనకు గురిచేసింది. భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గురైందని తెలిపారు.గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని చెప్పారు. మళ్లీ భూ ప్రకంపలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో నమోదైందని తెలిపారు. భూప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని సూచించారు.కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు.
రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది . చాలా చోట్ల ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.