Adilabad: కుల‌గ‌ణ‌న‌ను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం

Adilabad:తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న కుల‌గ‌ణ‌న స‌మ‌గ్ర స‌ర్వేను ఓ గ్రామంలోని గ్రామ‌స్థులు స్వ‌యంగా నిషేధం విధించారు. స‌ర్వే బుధ‌వారం నుంచే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ ఇప్పించి సిద్ధం చేసింది. ఈ నెలాఖ‌రు నాటికి స‌ర్వే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇంటింటికీ సిబ్బంది తిరిగి స‌మ‌గ్ర కుటుంబ వివ‌రాల‌ను న‌మోదు చేయాలని నిర్ణ‌యించారు. ఈ ద‌శ‌లోనే ఆ గ్రామం నిషేధం విధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Adilabad:ఆదిలాబాద్ జిల్లా దిలావ‌ర్‌పూర్ గ్రామ‌స్థులు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కుల‌గ‌ణ‌న స‌ర్వేను గ్రామంలో నిషేధిస్తున్న‌ట్టు తెలిపారు. తాము స‌హ‌క‌రింబోమ‌ని తేల్చి చెప్పారు. త‌మ గ్రామాన్ని నాశనం చేయ‌బోయే ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని తెలిపారు. ఈ మేర‌కు మండ‌ల త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం రూపంలో తెలియ‌జేశారు. అదేమిటంటే.. దిలావ‌ర్‌పూర్ గ్రామ ప‌రిధిలోని నిర్మిస్తున్న ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీని ర‌ద్దు చేయాల‌ని గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు.

Adilabad:గ్రామ‌స్థుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఇథ‌నాల్ కంపెనీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణ‌యించార‌ని దిలావ‌ర్‌పూర్ గ్రామ‌స్థులు త‌మ విన‌తిప‌త్రంలో తెలిపారు. ఫ్యాక్ట‌రీని నిర్మించొద్దు అంటూ ప‌లుమార్లు విన‌తిప‌త్రాల‌ను అంద‌జేసినా ప్ర‌భుత్వం వినిపించుకోలేద‌ని గ్రామ‌స్థులు తెలిపారు. ఈ మేర‌కు కుల‌గ‌ణ‌నను బ‌హిష్క‌రించాల‌ని దిలావ‌ర్ పూర్ గ్రామ క‌మిటీ సంయుక్తంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Warnes To Jagan: రంగంలోకి మొగుడు.. నరుకుడుగాళ్లు తట్టుకోగలరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *