Samantha: నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. మనం మళ్ళీ కలిసే వరకు నా హృదయం ముక్కలై ఉంటుంది నాన్నా అంటూ సామ్ పోస్ట్ పెట్టారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్. అయితే, ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆమె తల్లి నైనిట్ట సిరియన్ మలయాళీ. వాళ్ళది ప్రేమ వివాహం. తన కెరీర్ లో తన తండ్రి రోల్ ఎంతో ముఖ్యమని సామ్ చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించారు. చైతూతో విడాకుల తర్వాత జోసెఫ్ ఒకసారి ఫేస్ బుక్ లో షేర్ చేశారు చాలా రోజుల క్రితం ఓ జీవితం (కథ) ఉండేది. కానీ, ఇప్పుడు అది లేదు. అందుకని కొత్త జీవితం, కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇంతటి దుఖంలో సామ్ కు ఆమె అభిమానులు అండగా నిలుస్తూ దైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు.