saif ali khan

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరో చోట్ల గాయాలు

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో కత్తితో దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. ఈరోజు గురువారం ఉదయం 2;30 గంటలకి ఈ ఘటన  చోటుచేసుకుంది.  సైఫ్ అలీఖాన్ తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అతని ఇంటిలోకి దొంగలు చొరబడ్డారు దొంగతనానికి ప్రయత్నించారు.. వాళ్ళని చుసిన మానివాళ్ళు కేకలు వేయడంతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి కిందకి వచ్చాడు. దొంగలని అడ్డుకునేందుకు నటుడు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. 

సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని. దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి  అరెస్టు చేయడానికి అనేక బృందాలను ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరో చోట్ల కత్తి గాయాలయ్యాయి. రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ సంఘటనపై నటుడి బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. “సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దోపిడీ ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం నటుడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించాలని అభిమానులు మీడియాను మేము అభ్యర్థిస్తున్నాము. ఇది పోలీసు కేసు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాము” అని అందులో పేర్కొంది.

దీనిపై పోలీసులు విచారణ జరుపగా, సైఫ్ అలీఖాన్ ఇంట్లో పని చేస్తూ సెక్యూరిటీ పనులు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొందరిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *