Rajendra Prasad Daughter

Rajendra Prasad Daughter: రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..

Rajendra Prasad Daughter: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు .  నిన్న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అంటే అక్టోబర్ 5 ఉదయం ఆమె మృతి చెందారు. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు .

Also Read: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 

గాయత్రికి ఒక కొడుకు ,  కూతురు ఉన్నారు .  చిన్నవయసులోనే గాయత్రి మరణాన్ని రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇంట జరిగిన ఈ విషాదం తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయనను పరామర్సించడానికి వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *