Master Bharat: చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక ఘటనతో భరత్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
సినీ పరిశ్రమ నుంచి హీరోలు, దర్శకులు, నటులు భరత్‌కు ఫోన్‌ల ద్వారా సంతాపం తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు. టాలీవుడ్‌లోని పలువురు సినీ ప్రముఖులు చెన్నైకి బయలుదేరినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై మాస్టర్ భరత్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కమలహాసిని మరణానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Also Read: Anasuya: గృహప్రవేశం వేళ హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు.. అనసూయ భావోద్వేగ పోస్ట్
Master Bharat: తల్లి శవపేటిక వద్ద భరత్ తీవ్ర మనోవేదనతో కనిపించిన దృశ్యాలు అందరి కంటతడి పెట్టిస్తున్నాయి. కమలహాసిని ప్రోత్సాహంతోనే భరత్ బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. మాస్టర్ భరత్‌కు ఈ విషాద సమయంలో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా అండగా నిలుస్తున్నారు.

