Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది ‘పట్టుదల’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందించారు. స్టైలిష్, డైనమిక్ లుక్‌తో ఆకట్టుకున్న ఆయన, సినిమాల తర్వాత రేసింగ్‌లో నిమగ్నమయ్యారు. అయితే, తాజాగా బయటకు వచ్చిన అజిత్ లేటెస్ట్ లుక్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ లుక్‌లో ఆయన చాలా బలహీనంగా, వయసు మీరినట్లు కనిపిస్తున్నారని అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
54 ఏళ్ల వయసులోనే అజిత్, తన కంటే ఎక్కువ వయసు ఉన్న హీరోల కంటే పెద్దగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన హెయిర్‌స్టైల్ కూడా అభిమానులకు అసౌకర్యంగా అనిపించేలా ఉంది. ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన అజిత్, గతంలో ఆకర్షణీయ లుక్‌తో ఆకట్టుకునేవారు. కానీ, ఈ కొత్త రూపం అభిమానుల్లో కలవరం రేకెత్తిస్తోంది. ఈ లుక్ వెనుక కారణాలేమిటి? అజిత్ తిరిగి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
அஜித் லேட்டஸ்ட் லுக் / மொட்டை அடித்து ஆளே மாறிய AK https://t.co/9ydAryPEB9 via @YouTube #AK #AjithKumar #AjithKumarRacing #Ajith
— entertamil2 (@entertamilweb) June 25, 2025