Aditya Om: నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు ఆదిత్య ఓం. తెలంగాణాలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్య ను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకొచ్చారు. కలుషితమైన నీటి కారణంగా అక్కడి ప్రజలు వ్యాధులకు గురి అవుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. త్వరితగతిన దీనిని పూర్తి చేసి సంక్రాంతికి వినియోగం లోకి తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆదిత్య ఓం… ప్రస్తుతం ‘బందీ’ అనే ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు.