Aarya: ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్య నివాసంపై బుధవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం.
చెన్నైలోని అన్నా నగర్‌లో ఉన్న ఆర్య ఇంటితో పాటు, ఆయన గతంలో సంబంధం కలిగి ఉన్న “సీ షెల్” రెస్టారెంట్లపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు “సీ షెల్” రెస్టారెంట్ శాఖలలో ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారుల బృందాలు ఉదయం 8 గంటలకే రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖలకు చేరుకుని దాడులు ప్రారంభించాయి. పోలీసుల బందోబస్తు నడుమ ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
Also Read: Ys Sharmila: కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి నా ఫోన్లు ట్యాప్ చేశారు
Aarya: ఈ దాడులపై ఆర్య స్పందిస్తూ, “సీ షెల్” రెస్టారెంట్లతో తనకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదని స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఈ హోటళ్ల నిర్వహణ బాధ్యతను తాను కొన్నేళ్ల క్రితమే మరో వ్యక్తికి అప్పగించినట్లు ఆయన వివరించారు. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆర్య, తెలుగులో కూడా “రాజా రాణి” వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆర్య ఇంట్లో ఐటీ దాడులు జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.