road accident

తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్, రావూరి వాసవి, నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత ఇదంతా కలిసి ఇనోవా కారులో తిరుపతిలో జరగానున్న రిసెప్షన్ కి బయలుదేరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సును ఢీకొట్టడం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *